సిరిరాజా :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి. ఈనెల అంటే ఆగస్టు 25న సిబిఐ కోర్టులో ఏపీ
- సిఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి బెయిలు రద్దయితే రాష్ట్ర భవిష్యత్తు ఏంటన్నది
ప్రశ్నార్థకంగా మారనుంది. ఒక వేళ బెయిలు రద్దయితే కచ్చితంగా అతన్ని అరెస్టు చేస్తారు. దీన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ నెల
22ను కోర్టుకు హాజరవ్వాలని సిబిఐ కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.గతంలో బిజెపితో వైసిపికి మంచి సంబంధాలే ఉండేవి. ఇటీవల వారి మధ్య లుకలుకలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇరు పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం దూషించుకుంటున్నారు. ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినడంతో
సిఎం అరెస్టుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిస్తోంది. ఒకవేళ సిఎం జగన్మోహన్‌రెడ్దిని అరెస్టు చేస్తే
ఎపిలో తరువాత సిఎం ఎవరన్నదానిపై చర్చ జోరందుకుంది.
సిఎం రేసులో ముగ్గురు?
సిఎంను అరెస్టు చేస్తే రాష్ట్రంలో సీనియర్ మంత్రులు ఇద్దరిలో ఒకరికి సిఎం అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇందులో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇంకొకరు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను
వేర్వేరుగా కలిసినట్లు సమాచారం. పెద్దిరెడ్డి ఏడాది క్రితమే కేంద్రంలో ఉన్న పెద్దలను కలిసి జగన్మోహన్‌రెడ్దిని అరెస్టు
చేస్తే తనను సిఎంను చేయాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ బిజెపి మాత్రం ఎపిలో ఎక్కువ మంది
ఓటర్లున్న కాపు కులానికి చెందిన నాయకునికే సిఎం పదవి అప్పజెప్పి మెల్లగా రాష్ట్రంలోకి వారు చొచ్చుకొచ్చేందుకు
ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి ఇప్పటికే తన పార్టీ విషయంలో ఎపి అధ్యక్షులను
రెండు సార్లూ కాపులనే నియమించింది. వారి వల్ల పార్టీ బలోపేతం కావడం లేదని మరో కాపు నాయకునికి చెందిన
జనసేన పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో కాపులకు చెందిన వైసిపి మంత్రి బొత్స
సత్యనారాయణను సిఎం కుర్చీలో కూర్చొబెట్టి తెరవెనుక బిజెపి పావులు కదపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు జగన్ సతీమణి భారతి కూడా సీఎం రేసులో ఉందని.. ఆమెకు ఇప్పటికే రాజకీయ శిక్షణా తరగతులు కూడా ప్రారంభమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
25 మంది మంత్రులకూ ఉద్వాసన..
రాష్ట్రంలో ప్రస్తుతం 25 మంది మంత్రులున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నారు. వీరందరిని తొలగించి
కొత్త వారికి మంత్రి పదవులు ఇవ్వాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో సీనియర్
మంత్రులను తొలగించే పరిస్థితి వస్తే పార్టీలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వకపోయినా వ్యతిరేకత
వస్తోంది. ఈ రెండింటిని సమన్వయం చెసుకుని మంత్రి వర్గ విస్తరణ చేయాలని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. ఇది
కూడా త్వరలోనే జరగనున్నట్లు సమాచారం.
- సిఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి బెయిలు రద్దయితే రాష్ట్ర భవిష్యత్తు ఏంటన్నది
- చెల్లి షర్మిల పార్టీతో మరో తలనొప్పి..
ఏపీ సిఎం జగన్మోహన్‌రెడ్డి చుట్టూ సమస్యలు చుట్టుకున్నాయి. ఒకవైపు కోర్టు కేసులు.. మరో వైపు మంత్రి వర్గ
విస్తరణ, ఇంకో వైపు తన సొంత చెల్లి తెలంగాణలో పార్టీ పెట్టడం.. అందుకు వారి తల్లి స్వయంగా హాజరవ్వడం జగన్ కు మరింత
తలనొప్పిగా మారింది. వాస్తవానికి వైఎస్ విజయమ్మ ఏపీలో వైసిపికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అటువంటి
గౌరవమైన పదవులో ఉన్న ఆమె తన కూతురు వేరే పార్టీ పెట్టినపుడు నేరుగా వెళ్లి హాజరవడం.. అందులో ప్రధాన వక్తగా మాట్లాడటంతో వైసిపిలో అంతర్గత విమర్శలొచ్చాయి. సొంత తల్లి, చెల్లిని నిలువరించలేకపోయిన జగన్ రాష్ట్రాన్ని ఏమి ఏలుతారని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి.
పైగా సిఎం జగన్మోహన్‌రెడ్డికి గతంలో ఉన్న ప్రజాధరణతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గిందని ఇటీవల నిర్వహించిన సర్వేలో టాప్-2 నుండి టాప్-11 పడిపోయినట్లు పలు సర్వేలలో వెల్లడైంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ కొట్టుమిట్టాడుతున్నారు. - ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదల ఇతర కారణాల వల్ల జగన్ ర్యాంకు పడిపోవడానికి కారణాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వీటన్నింటిని తట్టుకుని నిలబడగలడా? ఇంతకీ జగన్ ను అరెస్టు చేస్తారా? అన్న విషయాలపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ విషయంపైనే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకోవడం గమనార్హం.