22.2 C
Hyderabad
Tuesday, September 27, 2022

అయ్య బాబోయ్… అషురెడ్డితో ఆర్జీవీ… వీడియో వైరల్!

Must read

రామ్‌ గోపాల్‌ వర్మ. నలుగురికి నచ్చనిది.. తనకు బాగా నచ్చిందని చెప్పే రకం ఆర్జీవీ. ముఖ్యంగా మహిళల గురించి ఆర్జీవీ చేసే కామెంట్స్‌ చాలా వైరల్‌ అవడంతో పాటు.. వివాదాస్పదం కూడా అవుతుంటాయి. అయినప్పటికీ.. ఈ వివాదాస్పద దర్శకుడు ఇంటర్వ్యూ కోసం లేడీ యాంకర్స్‌ క్యూ కడుతుంటారు. దానికి కారణం.. ఆయనను ఇంటర్వ్యూ ప్రతి యాంకర్‌కి నెట్టింట ఫేమస్‌ అయిపోతుంటారు. దీనికి బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానానే ఉదాహరణ. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆమెకు ఏకంగా బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి వెళ్లే అవకాశం వచ్చింది.

బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి కూడా వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. ఇక తన ఇంటర్వ్యూ కోసం వచ్చిన లేడీ యాంకర్స్‌ పట్ల వర్మ ఎలా ప్రవర్తిస్తాడో అందరికి తెలిసిందే. తనదైన మాటలు, చేష్టలతో వారికి పొగిడేస్తుంటాడు. అషు రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ముందు తన ఫోటోగ్రఫీ టాలెంట్‌ని చూపించాడు వర్మ. అషు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా.. వర్మ కింద కూర్చొని ఫోటో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ వీడియో ఇంకా బయటకు రాలేదు. ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో హల్‏చల్ చేస్తోంది.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article